నాసా–స్పేస్ఎక్స్ ప్రయోగం సక్సెస్..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) నివసించే వ్యోమగాముల కోసం నాసా (NASA) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్గో మిషన్ విజయవంతమైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఇవాళ (అక్టోబర్ 13, 2026) సాయంత్రం 4:03 గంటలకు స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో వ్యోమగాముల కోసం 2,800 కేజీలకు పైగా ఆహారం, రోజువారీ సామాగ్రి, నూతన పరికరాలు, అత్యంత కీలకమైన శాస్త్రీయ ప్రయోగ సామగ్రిని పంపినట్లు నాసా వెల్లడించింది.

