ఉగ్రవాదాన్ని ఏ దేశమూ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోరాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి సంబంధించిన మొత్తం వ్యవస్థను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇందులో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, యువతను నియమించుకోవడం, తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం, అలాగే సురక్షిత స్థావరాలు కల్పించడం వంటి అంశాలన్నింటిపైనా దృష్టి పెట్టాలని సూచించారు. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

