loader
iqonic-blog

ట్యాంక్ బండ్ పై ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన భార్య రష్మిక మందన్నతో కలిసి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఈ సెలబ్రెటీ కపుల్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆహ్వానం మేరకు విజయ్, రష్మిక ఈ వేడుకకు హాజరయ్యారు. మంత్రి సీతక్కతో పాటు వేలాది మంది మహిళలతో కలిసి ఈ పూల పండుగలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

iqonic-blog

రష్యా లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ స్థాయిలో వైమానిక దాడులకు పాల్పడింది. రష్యాలోని వివిధ ప్రాంతాలపై ఒకేసారి వెయ్యికి పైగా డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల వల్ల సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఒక చమురు ఎగుమతి టెర్మినల్ అగ్నిప్రమాదానికి గురైంది. రష్యాలోని 15 ప్రాంతాలతో పాటు, క్రిమియా మరియు నల్ల సముద్రంపై మొత్తం 1,015 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని పెట్రోబర్గ్‌ ఆయిల్ టెర్మినల్, ‘రుచి’ ఆయిల్ డిపోల్లో భారీ అగ్నిప్రమాదాలు […]

iqonic-blog

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై దుండగులు కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఫుట్‌బాల్ ఆడి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నటుడి డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడగా, వారిని వెంటనే నానావతి ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ చేతికి గాయమైందని వైద్యులు తెలిపారు. ఈ దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ అనిల్ పండిట్, హర్మన్ సంధు బాధ్యులంటూ సోషల్ […]

iqonic-blog

ఈ నెల 16న మిథున్ రెడ్డి.. పార్టీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ వేయడానికి బయలుదేరినప్పుడు నామినేషన్ల కేంద్రం వద్ద చోటు చేసుకున్న గొడవలు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వివిధ సెక్షన్ల కింద వారిపై ఎఫ్ఐఆర్ పెట్టారు. అల్లర్లకు సంబంధించి పోలీసులు ప్రాథమికంగా మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఈ మూడు కేసుల్లో కూడా మిథున్ రెడ్డి పేరు చేర్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీకే చెందిన చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డెప్ప, మాజీ […]

iqonic-blog

సూపర్‌స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద మరోసారి రికార్డులను బద్ధలుకొడుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘జైలర్ 2’ సినిమాతో రజనీకాంత్ గర్జనకు థియేటర్లు హడలెత్తిపోతున్నాయి. విడుదలైన కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా నెట్ గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. ఈ జోరు చూస్తుంటే అతిత్వరలోనే రూ.400 కోట్ల క్లబ్‌లోకి సునాయాసంగా చేరుకునేలా కనిపిస్తోంది. 

iqonic-blog

బ్రిటన్ రాజధాని లండన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) పై విద్యార్థి సంఘాలు, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలకు ప్రతిగా పలువురు ప్రవాస భారతీయులు ఆందోళన చేపట్టారు. భారత ప్రభుత్వానికి మద్దతు తెలిపే ప్రవాసులు ‘టీమ్ భారత్’ పేరుతో ఒక బృందంగా ఏర్పడి ర్యాలీ నిర్వహించారు. లండన్‌లో చోటుచేసుకున్న ఈ పరిణామాలు భారత రాజకీయాల ప్రభావం విదేశాల్లోని ప్రవాస సమాజాలపైనా ఎలా ఉంటుందో మరోసారి చర్చకు తెచ్చాయి

iqonic-blog

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్వాలియర్లోని శీతామాత ఆలయం సమీపంలో ఓ ట్రక్కు అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఘటనలో 12 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది.చినోర్ వైపు నుంచి ధాన్యం లోడుతో వస్తున్న ట్రక్కు.. ఆలయం సమీపంలో అదుపుతప్పింది. బారికేడ్లు, ఆలయ ప్రధాన ద్వారం, గోడను ఢీకొని భక్తులపైకి దూసుకెళ్లింది.

iqonic-blog

దసరా పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తమ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. అర్హులైన సిబ్బందికి పండుగ అడ్వాన్స్ మంజూరు చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.అడ్వాన్స్ మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా రికవరీ చేయనున్నారు. తీసుకున్న అప్పును 10 సమాన నెలవారీ వాయిదాల (EMI) పద్ధతిలో ఉద్యోగుల వేతనాల నుండి ప్రతినెలా క్రమంగా జమ చేసుకుంటారు.క్లాస్ 3 మరియు క్లాస్ 4 స్థాయికి చెందిన అర్హులైన ఉద్యోగులందరికీ ఈ పండుగ అడ్వాన్స్ అందించనున్నారు.

iqonic-blog

మహా పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పూల సంబరాలు దుర్గాష్టమి రోజున జరిగే ‘సద్దుల బతుకమ్మ’తో అత్యంత వైభవంగా ముగుస్తాయి. అమ్మవారికి రకరకాల ‘సద్దులను’ (నైవేద్యాలను) సమర్పించే ఆచారం ఉంది. ప్రధానంగా ఐదు రకాల సద్దులను నివేదించడం వల్లనే ఈ పండుగకు ‘సద్దుల బతుకమ్మ’ లేదా ‘పెద్ద బతుకమ్మ’ అనే పేరు స్థిరపడింది. ఈ రోజున పులగమన్నం, పులిహోర, చిత్రాన్నం, నువ్వుల సద్ది, కొబ్బరి సద్ది, పెరుగన్నం వంటి రుచికరమైన నైవేద్యాలను సమర్పిస్తారు.

iqonic-blog

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట జరిగి 17 మంది మృతి చెందారు. మరో 35 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మృతుల్లో 13 మంది మహిళలు, ముగ్గురు పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్టు తెలిసింది. దుర్గా పూజ కోసం భారీగా భక్తులు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా భారీగా గాలివాన మొదలైంది. పార్కు వద్ద మండపం బయట వేచిచూస్తున్న వారంతా ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON