భారత్, శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో యువ ఆటగాడు మానవ్ సుతార్ అదరగొట్టేశాడు. రెండో ఇన్నింగ్స్లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్.. శ్రీలంకపై 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులు చేసి ఆలౌట్ అయింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 372 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 206 పరుగులకే కుప్పకూలిపోయింది.