loader

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ కన్నుమూత

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ కన్నుమూశారు.చెన్నై కావేరి ఆసుపత్రిలో వయోభారంతో ఆయన మృతి చెందినట్టు తెలుస్తోంది.

‘చుట్టమల్లే’ ఫేక్ వీడియోపై జాన్వీ కపూర్ స్పందన

‘దేవర’ చిత్రంలోని’చుట్టమల్లే’ పాటను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి అత్యంత అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడంపై కథానాయకి జాన్వీ కపూర్ స్పందించారు. సాంకేతికతను ఈ రీతిలో దుర్వినియోగం చేస్తూ డిజిటల్ వైపరీత్యానికి పాల్పడటం తీవ్రంగా కలవరపెడుతోందని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి నకిలీ వీడియోలను ఎవరూ సృష్టించవద్దని, సోషల్ మీడియా వేదికగా ఇతరులతో షేర్ చేయడం కానీ, ప్రచారం చేయడం కానీ చేయవద్దని నెటిజన్లను కోరారు.

ఆ నీచులను వదిలిపెట్టను: ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

సామాజిక మాధ్యమాల్లో AI సాంకేతికతను ఉపయోగించి అసభ్యకర రీతిలో వీడియోలను క్రియేట్ చేయడం పై అగ్రకథానాయకుడు Jr ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవర సినిమాలోని ‘చుట్టమల్లే’ పాట వీడియోను ఏఐతో మార్ఫింగ్ చేయడంపై ఆయన మండిపడ్డారు. మహిళలను పూజించే దేశంలో వారి గౌరవాన్ని దిగజార్చారంటూ ఎక్స్ పోస్ట్ చేశారు. వారిని వదిలిపెట్టబోనని, బాధ్యులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని, ఇలాంటి నీచమైన కంటెంట్ను సృష్టించడం సిగ్గుచేటు. ‘చుట్టమల్లే’ పాట మార్ఫింగ్ వీడియో వెనుక ఉన్న నీచులు […]

తాత జయంతి రోజున అల్లు అర్జున్ కీలక నిర్ణయం.. కొత్త క్రియేటివ్ ఆఫీస్‌కు ‘ఐకాన్జా’ పేరు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకు ఎంతో ఇష్టమైన తాత, ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా అక్టోబర్ 1న తన కొత్త క్రియేటివ్ ఆఫీస్‌ను ప్రారంభించారు. ఈ ప్రత్యేకమైన కార్యాలయానికి ‘ఐకాన్జా’ అనే పేరును పెట్టారు.ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఒక సరికొత్త ఆఫీస్.. ఒక సరికొత్త ఆరంభం. మా తాతగారు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం’’ […]

ఆటోలో రజనీకాంత్.. షాక్ అయిన ఫ్యాన్స్.. వీడియో వైరల్

ప్రస్తుతం రజనీకాంత్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ధర్మన్ అనే సినిమా షూటింగ్‌కు ఆయన ఆటోలో వెళ్లారు. ఇది చూసిన అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ధర్మన్ చిత్రీకరణ కర్ణాటకలోని మైసూర్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్ కోసం రజనీకాంత్ వస్తారని, అభిమానులు గేట్ల వద్ద ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అప్పుడే ఆయన ఒక ఆటోలో అక్కడికి వచ్చి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. అనంతరం రజనీకాంత్ అభిమానులను పలకరించి సెట్స్‌కు వెళ్లిపోయారు.

మేడారం వనదేవతలను దర్శించుకున్న ‘ది ప్యారడైజ్’ చిత్ర బృందం

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలను ‘ది ప్యారడైజ్ ’చిత్ర బృందం దర్శించుకుంది. మంగళవారం కథా నాయకుడు నాని, నటుడు సంపూర్ణేశ్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత చెరుకూరి శ్రీకాంత్ సమ్మక్క సారలమ్మలకు పూజలు చేశారు. హీరో నాని 64 కిలోల నిలువెత్తు బంగారం సమర్పించారు. పూజారులు చిత్ర బృందానికి ప్రసాదం అందజేశారు. బిఆర్ఎస్ నాయకులు హీరో నానికి ఘన స్వాగతం పలికారు. నానిని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు ప్రత్యేక […]

డీజే సౌండ్స్‌పై కామెంట్స్ చేసినందుకు ట్రోలింగ్.. నా పాయింట్ అర్థం చేసుకోండంటూ రేణూ కామెంట్

వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకల్లో రాత్రివేళ డీజే సౌండ్స్‌పై చేసిన వ్యాఖ్యలతో నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు తప్పుగా తీవ్రస్థాయిలో ట్రోల్ చేయడంతో.. తాజాగా రేణు దేశాయ్ మరోసారి స్పందించారు. తన ఉద్దేశం మతాన్ని లేదా ధర్మాన్ని విమర్శించడం కాదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు. తాను సనాతన ధర్మానికి ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడనని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. గణపతి బప్పాపై తనకు ఎంతో […]

నానికి ఫ్యాన్స్ రిక్వెస్ట్

విపరీతమైన మాస్ ఇమేజ్ వేటపై నాని సొంత అభిమానులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ‘దసరా’లో నాని మేకోవర్ మరియు నటన మెప్పించినప్పటికీ, వరుసగా ప్రతీ సినిమాలోనూ అదే తరహా మాస్, వయొలెన్స్ ఉన్న పాత్రలను ఎంచుకోవడం ఆయన సహజత్వానికి సరిపోవడం లేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రక్తపాతం, హెవీ డైలాగ్స్ కంటే నాని మార్క్ హ్యూమర్, ఎమోషన్స్ ఉన్న సినిమాలే తమకు కావాలని, వెంటనే తన పాత శైలి ‘క్లాస్ నాని’గా రీ-ఎంట్రీ ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా […]

ఉపాసనకు అపోలోలో కొత్త బాధ్యతలు

అపోలో హాస్పిటల్స్ CSR వైస్ చైర్‌పర్సన్‌గా, హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా నటుడు రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన కొణిదెల బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఈ కొత్త బాధ్యతల ద్వారా దేశవ్యాప్తంగా అపోలో గ్రూప్ చేపడుతున్న విస్తరణ కార్యక్రమాలకు నాయకత్వం వహించనున్నారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం సుమారు రూ.8,600 కోట్ల భారీ పెట్టుబడితో తమ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా కొత్త ఆసుపత్రుల నిర్మాణం, ప్రస్తుత ఆసుపత్రుల ఆధునికీకరణ వంటి ప్రాజెక్టులను ఉపాసన […]

డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్షురాలిపై దాడి – జనరల్ మీటింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) జనరల్ బాడీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తనపై కొందరు దాడికి పాల్పడి చంపుతామని బెదిరించారని ఆరోపిస్తూ అసోసియేషన్ అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘు మాస్టర్ తరఫున ఉన్న కొందరు లేడీ డ్యాన్సర్లు తనపై పథకం ప్రకారమే మూకుమ్మడిగా దాడి చేశారని, తనను తీవ్రంగా కొట్టి అసభ్య పదజాలంతో దూషించారని సుమలతా దేవి పోలీసులకు ఇచ్చిన […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON