loader

శాంతిభద్రతలకు వైసీపీ భంగం కలిగిస్తోంది – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యములో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరియు పార్టీ కీలక నేతలతో నిర్వహించిన సుదీర్ఘ టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షం అనుసరిస్తున్న వ్యూహాలు, అక్రమ చర్యలపై నిరంతరం దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు స్థానిక అధికారులను అప్రమత్తం చేస్తూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని నేతలకు దిశా […]

కొలిక‌పూడి తిరుగుబాటు.. కూట‌మిలో రేగిన ముస‌లం

తిరువురు నియోజ‌క‌ వ‌ర్గంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు కుంప‌ట్లు రాజేశాయి. కూట‌మిలో చైర్మ‌న్ అభ్య‌ర్థి ఎంపిక ముస‌లం రేపింది. పొత్తులో భాగంగా తిరువూరు మున్సిప‌ల్ చైర్మ‌న్ స్థానం జ‌న‌సేనకు కేటాయించింది కూట‌మి ప్ర‌భుత్వం. అయితే, అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస్ తిరుగుబాటు ప్ర‌క‌టించారు. త‌న త‌రుపున నాగ శ్రావ‌ణీని టీడీపీ ఎమ్మెల్యే కొలిక‌పూడి ప్ర‌క‌టించారు. రేపు తిరువూరు మున్సిపాల్టీ చైర్మన్ అభ్యర్ధి పెనుబల్లి శ్రావణి నామినేషన్ ర్యాలీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.

జనసేన అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధా

జనసేన పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితా: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ,ఏలూరు మేయర్ అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడు అమలాపురం- నల్ల శ్రీధర్, చిలకలూరిపేట-తోట రాజేశ్వరి, గొల్లప్రోలు- కడారి తమ్మయ్య నాయుడు, నరసాపురం- కొత్తపల్లి శైలజ, నిడదవోలు-కల్లం జ్యోతి, పెడన-మట్టా శివపావని, పిఠాపురం-బీరా విజయ్ శేఖర్, పుత్తూరు-డి. ఏలుమలై, సాలూరు నుంచి గొర్లె విజయకుమారి, సామర్లకోట నుంచి పిట్టా జానకీ రామారావు, తెనాలి నుంచి టి. వెంకటరమణారావు, తిరువూరు నుంచి పి. మాధవి అభ్యర్థులు ఉన్నారు.

వైసీపీలోకి టీడీపీ మాజీ మహిళా ఎమ్మెల్యే?.. మేయర్ పదవి ఫిక్స్,

శ్రీకాకుళంలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం మేయర్ పదవి ఆమెకు కేటాయించే అవకాశం ఉందని.. అందుకే ఆమె వైఎస్సార్‌సీపీలోకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం మేయర్‌ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. గుండ లక్ష్మీదేవి కూటమి తరఫున మేయర్ సీటు ఆశించారు. కానీ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా శ్రీకాకుళం మేయర్ జనసేన పార్టీకి కేటాయించారు.

రూబియో పిలిస్తే జైశంకర్ వెళ్లాలా?

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ముంబయిలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో సమావేశం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. భారత విదేశాంగ మంత్రి సమావేశ వివరాలను అమెరికా రాయబారి సెర్గియో గోర్ ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మిస్టర్ రూబియో తన ఉద్యోగిని ముంబయికి పిలిపించారు. విదేశాంగ శాఖలో ఏం జరుగుతోందో మీ అధికారులకే స్పష్టత లేదు. మోదీజీ, మీరు దీనిపై వివరణ ఇవ్వాలి. లేదంటే […]

‘చేతులెత్తి అడుగుతున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి’.. తెలంగాణ యువతకు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్

తెలంగాణ యువత రాజకీయ ఆకాంక్షలు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు సాగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణలో జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని పట్టభద్రులు, యువతను చేతులెత్తి విజ్ఞప్తి చేశారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావుకు మద్దతుగా రూపొందించిన ‘ జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ ’ ప్రచార రథాన్ని పవన్ కళ్యాణ్ శుక్రవారం హైదరాబాద్‌లో […]

రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాల‌న న‌డుస్తోంది: జ‌గ‌న్..

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో పుంగనూరులో చోటుచేసుకున్న దాడి ఘటనపై వైఎస్‌ జగన్‌ స్పందించారు. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి ఫోన్‌ చేసి మాట్లాడారు. పర్యటన సందర్భంగా ఎదురైన పరిస్థితులు, దాడి జరిగిన తీరు, అక్కడ నెలకొన్న ఉద్రిక్తతల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్‌.. పార్టీ నేతలు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే వైఎస్సార్‌సీపీ నాయకులు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని […]

మిథున్‌ రెడ్డిపై టీడీపీ కార్యకర్తల దాడి..

చిత్తూరు జిల్లా పుంగనూరు నామినేషన్‌ సెంటర్‌ వద్ద కూడా టీడీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. వాహనాలను ధ్వంసం చేసి తిరగబెట్టేశారు. నామినేషన్‌ను సెంటర్‌ను టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టేశారు. నామినేషన్‌ కార్యక్రమానికి వెళ్తుండగా టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. టీడీపీ కార్యకర్తలు దాడిలో 10 వాహనాలు ధ్వంసమయ్యాయి. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారు. కత్తులు, రాళ్లు, కర్రలతో మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలు దాడిలో మిథున్‌రెడ్డి గాయపడ్డారు. మిథున్‌రెడ్డి గన్‌మెన్‌ తలకు తీవ్రగాయమైంది. […]

నామినేషన్ల వేళ రాయచోటిలో ఉద్రిక్తత..

అన్నమయ్య జిల్లా రాయచోటిలో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నామినేషన్లు ప్రారంభమైన తొలి గంటలోనే ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నట్లు సమాచారం. రాళ్లదాడిలో మధు రాయల్‌ రక్తగాయాలతో బాధపడినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రతిదాడికి దిగినట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో పలు వాహనాలు మంటల్లో దగ్ధమైనట్లు సమాచారం. వైసీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ నిర్వహించిన […]

ఏపీలో స్థానిక ఎన్నికలపై SEC కీలక నిర్ణయం- రంగంలోకి 28 మంది ఐఏఎస్ లు..!

స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా (AP SEC) ఇవాళ సాధారణ పరిశీలకులకు నియమించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లాకు ఒక అధికారి చొప్పున 28 మంది మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వారితో భేటీ అయిన ఎస్ఈసీ.. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON