loader

వరల్డ్‌కప్ టికెట్ల కోసం ఎగబడుతున్న ఫ్యాన్స్..

క్రికెట్ ప్రపంచకప్‌కు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. అభిమానుల్లో అప్పుడే వరల్డ్‌కప్ ఫీవర్ పీక్స్‌కు చేరింది.. వచ్చే ఏడాది జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్ టికెట్ బ్యాలెట్ ఓపెన్ చేసిన కేవలం 12 రోజుల్లోనే ఏకంగా 1.5 కోట్లకు పైగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అక్టోబర్ 7న ఆస్ట్రేలియాతో జరిగే టీమిండియా తొలి మ్యాచ్‌తో పాటు భారత్-పాక్ సమరానికి టికెట్ల కోసం ఫ్యాన్స్ఎగబడుతున్నారు.  ప్రపంచవ్యాప్తంగా 142 దేశాల నుంచి దాదాపు 44.23 లక్షల మంది అభిమానులు రిజిస్ట్రేషన్ […]

రాంచీలో సంజూ విధ్వంసం.. విండీస్ ముందు 250 పరుగుల భారీ టార్గెట్!

వెస్టిండీస్తో రాంచీ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ (82 పరుగులు, 41 బంతుల్లో) సూపర్ హాఫ్ సెంచరీతో రాణించగా, తిలక్ వర్మ (44* పరుగులు, 18 బంతుల్లో) ధనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. భారత బ్యాటర్ల ఊచకోత ముందు వెస్ట్ ఇండీస్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. రోస్టన్ చేజ్ 3 వికెట్లు పడగొట్టినప్పటికీ ధారాళంగా […]

ఆకాశంలో జెర్సీ.. 10వ నిమిషంలో మ్యాచ్ బంద్.. మెస్సీ వీడ్కోలు

ఫుట్‌బాల్ ప్రపంచంలో ఒక శకం పూర్తయింది. అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు అధికారికంగా వీడ్కోలు పలికారు. అక్టోబర్ 6, 2026న బ్యూనస్ ఎయిర్స్‌లో బెనిన్ జట్టుతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ మెస్సీకి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది. మ్యాచ్ 71వ నిమిషంలో లభించిన పెనాల్టీని మెస్సీ గోల్‌గా మలిచి తన వీడ్కోలును మరింత ప్రత్యేకం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక క్షణాలకు మెస్సీ భార్య, పిల్లలతో పాటు ఫుట్‌బాల్ దిగ్గజాలు సాక్ష్యంగా నిలిచారు.

భువీ ఈజ్ బ్యాక్.. కివీస్ పర్యటనకు భారత్ టీ20 జట్టు

టీమిండియా అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు న్యూజిలాండ్లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో టీ20 స్వ్కాడ్ ను బీసీసీఐ ప్రకటించింది.. జట్టు ఇదే: శ్రేయస్, అభిషేక్, శాంసన్, సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అక్షరపటేల్, దుబే, నితీశ్కుమార్, నమన్ ధిర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్, అర్జీప్, భువనేశ్వర్, వరుణ్ చక్రవర్తి, కులీప్. భువనేశ్వర్ దాదాపు 4 ఏళ్ల తర్వాత టీ20 జట్టులోకి వచ్చాడు.

కెప్టెన్సీకి గుడ్ బై .. హర్మన్ ప్రీత్ సంచలన నిర్ణయం!

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్ వైదొలిగారు. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. 2022 జూన్‌లో మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్లలో భారత జట్టు పగ్గాలు చేపట్టారు. ఆమె కెప్టెన్సీలో భారత మహిళల జట్టు తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. భారత్ 2025 వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న తన నిర్ణయాన్ని హర్మన్‌ప్రీత్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్ […]

ఫ్రీస్టైల్ రెజ్లింగ్ లో అమాన్ అద్భుత విజయం..!

ఆసియా గేమ్స్ 2026 పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో భారత్ పసిడి పతకాన్ని ముద్దాడింది. శనివారం నాగోయాలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో భారత రెజ్లర్ అమాన్ షెహ్రావత్ అద్భుత విజయాన్ని సాధించారు. ఉత్తర కొరియాకు చెందిన ప్రపంచ ఛాంపియన్ హన్ చోంగ్ సాంగ్ను 11-7 తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు. గత 2022 హాంగ్జౌ ఆసియా గేమ్స్ కాంస్యం గెలిచిన అమాన్కు ఈ విభాగంలో ఇది రెండో పతకం కావడం విశేషం.

పాకిస్థాన్ పై ఘన విజయం.. భారత్ ‘గోల్డ్ మెడల్’

ఆసియా క్రీడల్లో పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 19 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో భారత్ కే స్వర్ణ పతకం దక్కింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 212 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ కు ఇవ్వగా, ఛేదనలో పాక్ 192 పరుగులకే పరిమితమైంది. నవాజ్ (96) చివరివరకూ పోరాడినా ఓటమి తప్పలేదు.

గోల్ఫ్‌లో గోల్డ్‌.. ఏషియ‌న్ గేమ్స్‌లో ప్ర‌ణ‌వి సంచ‌ల‌నం

ఏషియ‌న్ గేమ్స్‌లో.. భార‌త్‌కు గోల్ప్‌లో గోల్డ్ మెడ‌ల్ ద‌క్కింది. భార‌త మ‌హిళా ప్లేయ‌ర్ ప్ర‌ణ‌వి ఉర్స్.. వ్య‌క్తిగ‌త స్ట్రోక్ ప్లే గోల్ఫ్ ఈవెంట్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలుచుకున్న‌ది. ఫైన‌ల్ రౌండ్‌లో ఓ స్ట్రోక్ లీడ్‌తో ఆమె ఆ మెడ‌ల్‌ను కైవ‌సం చేసుకున్న‌ది. అయితే గోల్ఫ్‌లో ఇండియన్ టీమ్‌కు సిల్వ‌ర్ కూడా ద‌క్కింది. ప్ర‌ణ‌వి.. చివ‌రి క్ష‌ణాల్లో అద్భుతంగా ఆడింది. చైనా ప్లేయ‌ర్ యిన్ రౌనింగ్‌, సింగ‌పూర్ ప్లేయ‌ర్ షాన‌న్ టాన్ నుంచి గ‌ట్టి పోటీ ఉన్నా.. ప్ర‌ణ‌వి […]

అభిషేక్‌ సిక్సర్ల సునామీ.. కోహ్లీని దాటేసి..

ఆసియా క్రీడల్లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 61 పరుగులతో విరుచుకుపడిన అతడు.. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. పాక్‌పై టీ20ల్లో 14 సిక్సర్లు బాదాడు అభిషేక్. దీంతో ఆ జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన విరాట్ కోహ్లీ(11)ని అతడు అధిగమించాడు. ఫైనల్లో 7 సిక్సర్లు బాదిన శర్మ.. యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు. టీ20ల్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన అభిషేక్.. […]

44 ఏళ్ల నిరీక్షణకు తెర..భారత్‌కు గోల్డెన్ విక్టరీ!

ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో భారత్ స్వర్ణ పతకం సాధించింది. 1982 తర్వాత ఈ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం. ఫైనల్ మ్యాచ్‌లో చైనాతో భారత్ తలపడింది. భారత్ పటిష్టమైన డిఫెన్స్‌ను ప్రదర్శించి 1-0 తేడాతో విజయం సాధించింది. 2026 ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 16వ స్వర్ణ పతకం. ఫైనల్‌లో భారత్ తరఫున లాల్‌రెమ్సియామి హమర్‌జోటే ఏకైక గోల్ సాధించింది. ఆమె మ్యాచ్ మొదటి క్వార్టర్‌లోని 10వ నిమిషంలో ఈ గోల్ చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON