స్టీవ్ వాకు మోదీ అరుదైన బహుమతి.. 20 ఏళ్ల నాటి మధుర జ్ఞాపకం
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ స్టీవ్ వాకు ఒక మరువలేని అరుదైన కానుకను అందించి సర్ప్రైజ్ చేశారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్న నాటి మధుర జ్ఞాపకాన్ని గుర్తుచేస్తూ.. ఆనాటి అరుదైన ఫోటోను ఫ్రేమ్ కట్టించి శుక్రవారం నాడు స్టీవ్ వాకు ప్రధాని బహూకరించారు. గతంలో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్న సమయంలో స్టీవ్ వా ఆయనను కలిసి […]

