కేంద్రం తలపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్)ను ఏ రూపంలో ఉన్నా తమిళనాడు ఆమోదించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ స్పష్టం చేశారు. తమ పార్టీ టివికె ఆవిర్భావం నుంచి కూడా డిలిమిటేషన్‌ను వ్యతిరేకించిందని, డిలిమిటేషన్‌తో తమిళనాడు లోక్‌సభ ప్రాతినిధ్యం తగ్గుతుంది. కేంద్ర నిధులకు కూడా గండిపడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం వెంటనే ప్రతిపాదిత డిలిమిటేషన్‌ను వెనకకు తీసుకోవాలి. కాదు కూడదనుకుని ముందుకు సాగితే తమిళనాడు తరఫున తమ తీవ్ర ప్రతిఘటన ఉంటుందని ఈ సభలో విజయ్ కేంద్రాన్ని హెచ్చరించారు.