ఏపీ కేబినెట్‌లో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలే తప్ప ఉత్తుత్తి సమావేశాలు ఎందుకని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుఏపీ ప్రభుత్వానికి సూచించారు. పోర్టులు, భూములు తమ వారికి కట్టబెట్టడానికే చంద్రబాబు కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సాయికృష్ణ లాకప్‌డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య,
ఉండవల్లిలో పోలీసు కానిస్టేబుల్‌పై టీడీపీ కార్యకర్తల దాడి గురించి ఎందుకు చర్చించ లేదని ప్రశ్నించారు. కేబినెట్ సమావేశానికి డీజీపీ వెళ్లి సోషల్ మీడియా కట్టడిపై మాట్లాడడం విచిత్రమని వెల్లడించారు.