పల్నాడులో విషాదం.. కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు దుర్మరణం
ఏపీలోని పల్నాడు జిల్లాలో అచ్చంపేట మండలం, కోసూరు గ్రామం సమీపంలో 10 మంది కలిసి కృష్ణా నదిలో షికారు చేయడానికి ఒక చిన్న నావలో బయలుదేరారు. అయితే, నదిలో కాసేపు తిరిగిన తర్వాత తిరుగు ప్రయాణంలో పడవ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి నీటిలో మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న వారంతా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. స్థానికులు తక్షణమే స్పందించి సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగారు. అమాయక చిన్నారులతో పాటు మొత్తం నలుగురు నీట మునిగి […]

