loader

సీన్‌లోకి పళని స్వామి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్‌కు లేఖ

తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగతుందో అన్న ఆందోళన నెలకొంది. విజయ్ చేస్తున్న ప్రయత్నాలు వరుసగా బెడిసికొడుతున్నాయి.ఇలాంటి తరుణంలో తెరపైకి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తెరపైకి వచ్చారు. పళనిస్వామికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్‌కు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఏఎంఎంకే పార్టీ అధినేత టీటీవీ దినకరణ్ గవర్నర్‌ను కోరడం తమిళనాట రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ఫిన్ అలెన్ విధ్వంసం.. అక్షర్ సేనపై కేకేఆర్ ఘనవిజయం

ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దిశగా దూసుకుపోతున్న తరుణంలో,  ఢిల్లీ క్యాపిటల్స్ (DC) నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ అలవోకగా ఛేదించింది. ఫిన్ అలెన్ వీరబాదుడుతో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుని, , కోల్‌కతా బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేకేఆర్ బ్యాటర్లు ఏమాత్రం కనికరం చూపకుండా ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశారు. కేవలం 14.2 ఓవర్లలోనే 2 వికెట్లు […]

స్వదేశానికి చేరుకున్న షానవాజ్.. స్పందించిన పవన్ కల్యాణ్

ఒమన్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అన్నమయ్య జిల్లాలోని వాయల్పాడుకు చెందిన షానవాజ్.. క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. షానవాజ్ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే.. ఆమె క్షేమంగా స్వదేశానికి తిరిగి రావడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను MEAIndia అభ్యర్థించానని తెలిపారు. వారు వెంటనే స్పందించారన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతర సమన్వయం, మానవతా దృక్పథం వల్ల.. షానవాజ్ క్షేమంగా భారత్ చేరుకున్నారని పేర్కొన్నారు.

తమిళనాడులో సంచలన ట్విస్ట్.. విజయ్ ప్రమాణ స్వీకారం డౌటే !

తమిళనాడు రాజకీయాల్లో గంటల వ్యవధిలోనే అనూహ్య మలుపు చోటుచేసుకుంది. విజయ్ పట్టాభిషేకం ఖాయమన్న సంబరాల మధ్యే , ఐయూఎంఎల్, వీసీకే పార్టీల నుంచి అధికారికంగా లేఖ అందలేదని తమిళనాడు లోక్‌భవన్ తెలిపింది. టీవీకేకు మద్దతుగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి మాత్రమే గవర్నర్ కు లేఖలు అందాయి. ఐతే, మద్దతు ప్రకటిస్తారని అనుకున్న వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు మాత్రం గవర్నర్ కు లేఖ అందించలేదు. మరో సంచలన ట్విస్ట్ అన్నాడీఎంకే అధినేత పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు […]

ఆగస్టు 15న రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు – కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం

2027 నాటికి రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు ఉండాలనే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే ఆగస్టు 15 నాటికి 2.50 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు చేయించాలని, డిసెంబర్ నాటికి మరో 2.38 లక్షల ఇళ్లను సిద్ధం చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2027 డిసెంబర్ నాటికి అదనంగా మరో 10 లక్షల ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

ఇండియన్లు తెగ వాడేస్తున్న టాప్ 5 ఏఐ టూల్స్ ఇవే!

భారతదేశంలో ఏఐ విప్లవం కొనసాగుతుంది. ప్రతి చిన్న విషయానికి ఏఐ మీద ఆధారపడిన వారి పెరిగిపోతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, డిజైనర్లు అందరూ రోజువారీ పనుల్లో AIని ఉపయోగిస్తున్నారు. భారతీయులు ఎక్కువగా వాడుతున్న టాప్ 5 ఏఐ టూల్స్ : చాట్ జిపిటి (ఓపెన్ ఏఐ) | గూగుల్ జెమిని | కాన్వా | క్లాడ్ | గ్రోక్

సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న అషు రెడ్డి..

బిగ్ బాస్ ఫేం, నటి అషు రెడ్డి సడన్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారా?… తాజాగా ఆమె ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. తన చేతికి రింగ్ చూసుకుంటూ అషు రెడ్డి సిగ్గు పడిన ఫోటో ట్రెండ్ అవుతోంది. కెమెరా ఎమోజీ తప్ప మరే క్యాప్షన్ ఇవ్వలేదు. వరుడి చేతిలో చేయి వేసినట్లుగా పిక్స్ ఉన్నాయి. మరి కాబోయే వరుడు ఎవరు? నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకుందా? లేదా ఏదైనా సినిమా షూటింగ్‌లో భాగమా అనేది తెలియాల్సి […]

సచివాలయంపై డ్రోన్ అంటూ తప్పుడు ప్రచారం.. ప్రభుత్వం సీరియస్

రాజధాని అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కలెక్టర్ల సదస్సు జరుగుతున్న సమయంలో.. సచివాలయంపై డ్రోన్ కలకలం అంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. శాంతిభద్రతల దృష్ట్యా కీలకమైన సమయంలో ఇలాంటి పుకార్లు పుట్టించడం వెనుక కుట్ర కోణం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న AI2903 విమానాన్ని చూపించి.. అది డ్రోన్ అంటూ తప్పుడు ప్రచారం చేశారని పోలీసులు నిర్ధారించారు.

భట్టిపై MP రేణుకా చౌదరి ఆగ్రహం

ఖమ్మం జిల్లాలో ఇటీవలి కాలంలో భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన అనుచరులకే పెద్దపీట వేశారని రేణుకా చౌదరి వర్గం ఆరోపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాణాలకు తెగించి, పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులకు మొండిచేయి ఎదురైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పదవులు దక్కని అసంతృప్త నేతలతో కలిసి రేణుకా చౌదరి ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.  టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు […]

మాకు హిందూ, ముస్లిం భేదాభిప్రాయం లేదు : సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నాంపల్లి హజ్ హౌస్ లో హజ్ యాత్రికుల బస్సుల ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, యాత్రకు జెండా ఊపారు. తమకు హిందూ, ముస్లిం భేదాభిప్రాయం లేదని, హిందూ ముస్లిం భాయీ భాయీ అని వ్యాఖ్యానించారు. సంక్షేమంలో మైనారిటీల వాటాను వారికి అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగాలలో, సంక్షేమ పథకాలలో మైనారిటీలకు దక్కాల్సిన వాటాను వారికి అందిస్తున్నామన్న సీఎం.. విదేశీ విద్య విషయంలోనూ మైనారిటీలకు స్కాలర్షిప్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON