ఖమ్మం జిల్లాలో ఇటీవలి కాలంలో భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన అనుచరులకే పెద్దపీట వేశారని రేణుకా చౌదరి వర్గం ఆరోపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాణాలకు తెగించి, పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులకు మొండిచేయి ఎదురైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పదవులు దక్కని అసంతృప్త నేతలతో కలిసి రేణుకా చౌదరి ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు రేణుకా చౌదరి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

