<span;>మెక్సికోలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. అమెరికా భూభౌతిక సర్వే (USGS) వెల్లడించిన వివరాల ప్రకారం, రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం మెక్సికోలోని ప్యూర్టో మడెరో సమీప ప్రాంతాలను బలంగా కుదిపేసింది. భూకంపం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు అధికారులు తెలిపారు. భారత కాలమానం ప్రకారం రాత్రి సుమారు 8:18 గంటలకు (14:48 UTC) ఈ ప్రకంపనలు నమోదయ్యాయి.