హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్ కేసులో ఆయనపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. రంగనాథ్ను తప్పించి మరో అధికారిని నియమించాలని సింగిల్ జడ్జి గతంలో తీర్పు ఇచ్చారు. దీనిపై రంగనాథ్ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు. ఆ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. హైడ్రా కమిషనర్ తరఫున హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ రాజీవ్ శక్టర్ వాదనలు వినిపించారు.