విజయసాయిని సజ్జల కొట్టింది నిజమే. మంగళగిరిలో ప్లీనరీ జరిగేటప్పుడు వేదికపై ఎవరితో మాట్లాడించాలనే దానిపై ఇద్దరి మధ్య వివాదం తలెత్తి, మాటామాటా పెరిగి కొట్టింది వాస్తవమే. విజయసాయి రెడ్డి 72 అవమానాలు జరిగాయని చెప్పారు. నాకు ఒక్కడికే తెలిసి మరో ఘోర అవమానం జరిగింది. తన సొంతూరైన తాళ్లపూడికి వచ్చినప్పుడు.. కాకుపల్లి సెంటర్లో వంద వాహానాలతో ఘనంగా స్వాగతం పలికారు. దానిపై విజయసాయిని సజ్జల నీచాతినీచంగా దూషించారు. ఆ మాటలు నా నోటితో నేను చెప్పలేను” అని కోటంరెడ్డి తెలిపారు.