31 ఏళ్ల క్రితం ఇదే రోజు తొలిసారి ముఖ్యమంత్రినయ్యానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. “48 ఏళ్ల నా రాజకీయ జీవితంలో మొగల్తూరుకు ఎన్నోసార్లు వచ్చా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టింది ఇవాళే. అంతకుముందు ఎన్నో రాజకీయ మార్పులు చూశా. నేను ఎన్ని జన్మలెత్తి సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను” అని సీఎం చంద్రబాబు ప్రజలనుద్దేశించి అన్నారు.

