loader

ప్రఖ్యాత సైంటిస్ట్ కన్నుమూత

అంతరిక్ష పరిశోధనా రంగంలో సరికొత్త శకానికి పునాది వేసిన ప్రఖ్యాత కంప్యూటర్ సైంటిస్ట్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ పితామహురాలు మార్గరెట్ హామిల్టన్ (90) కన్నుమూశారు. ఈమె సెప్టెంబర్ 30న తుదిశ్వాస విడిచినట్లు ప్రముఖ విద్యాసంస్థ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) అధికారికంగా ప్రకటించింది. 1961లో ప్రారంభమైన నాసా చారిత్రాత్మక ‘అపోలో’ అంతరిక్ష ప్రయోగాల కోసం సాఫ్ట్‌వేర్ రూపొందించిన 100 మంది నిపుణుల బృందానికి ఆమె నాయకత్వం వహించారు.  ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’తో పాటు అంతర్జాతీయంగా మరెన్నో […]

‘పదేళ్లలోపు పిల్లలకు ఆ ఔషధాలు వద్దు’

ప్రపంచవ్యాప్తంగా చిన్న వయసులో ఊబకాయంతో (Obesity) సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఔషధాల వాడకం, సర్జరీలు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో వీటి వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా పదేళ్లలోపు చిన్నారులకు బరువు తగ్గించే ఔషధాలు ఇవ్వవద్దని, అవి మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయనడానికి స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంది. పదేళ్ల కన్నా ఎక్కువ, యుక్త వయసు పిల్లల కోసమే లైసెన్సు పొందిన ఔషధాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని WHO […]

ఆకాశంలో జెర్సీ.. 10వ నిమిషంలో మ్యాచ్ బంద్.. మెస్సీ వీడ్కోలు

ఫుట్‌బాల్ ప్రపంచంలో ఒక శకం పూర్తయింది. అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు అధికారికంగా వీడ్కోలు పలికారు. అక్టోబర్ 6, 2026న బ్యూనస్ ఎయిర్స్‌లో బెనిన్ జట్టుతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ మెస్సీకి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది. మ్యాచ్ 71వ నిమిషంలో లభించిన పెనాల్టీని మెస్సీ గోల్‌గా మలిచి తన వీడ్కోలును మరింత ప్రత్యేకం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక క్షణాలకు మెస్సీ భార్య, పిల్లలతో పాటు ఫుట్‌బాల్ దిగ్గజాలు సాక్ష్యంగా నిలిచారు.

ఫ్రాన్స్ లో మిన్నంటిన విద్యార్థుల నిరసనలు

ఫ్రాన్స్ దేశంలో హై స్కూల్ విద్యార్థుల నిరసనలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. మంగళవారం జరిగిన ఆందోళనల్లో ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ చేయి కోల్పోవాల్సి వచ్చింది. పాఠశాలల్లో సరిగ్గా మౌలిక వసతులు లేకపోవడం, విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేకపోవడం, పాఠశాల విద్యా శాఖకు సరైన బడ్జెట్ కేటాయించకపోవడం వంటి కారణాలతో విద్యార్థులు ప్రారంభించిన ఆందోళనలు దేశాన్ని చుట్టేశాయి. రాజధాని పారిస్ నగరాన్ని ముట్టడించేందుకు దేశం నలువైపులా సుమారు 86 వేల మంది విద్యార్థులు చేరుకున్నారు. దీంతో వీరిని […]

కరిగిన లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు!

బిఎమ్‌డబ్ల్యూ వంటి దిగ్గజ ఫ్యాక్టరీలలో సుదీర్ఘకాలం విజయవంతంగా పనిచేసిన F.02 రోబోల సేవా కాలాన్ని ముగించాలని కంపెనీ భావించింది. ఎలాంటి వీడ్కోలు ఇస్తే బాగుంటుందని కంపెనీ సీఈఓ నెటిజన్లను అడిగారు. టెర్మినేటర్ స్టార్ ఆర్నాల్డ్ ష్వాజ్నెగర్ స్పందిస్తూ.. వాటిని కరిగించేయండి అని సరదాగా సలహా ఇచ్చారు. దాంతో కంపెనీ ఆర్నాల్డ్ మాటను సీరియస్‌గా తీసుకుని నిజంగానే రోబోలను ఫిన్‌లాండ్‌లోని ఒక స్టీల్ ప్లాంట్‌కు తరలించి, సుమారు 75 టన్నుల కరిగిన లోహం ఉన్న ఫర్నేస్‌లోకి స్వయంప్రతిపత్తితో దూకేలా […]

అంటార్కిటికా మంచు కింద విశ్వాన్ని వెతికిన శాస్త్రవేత్త.. హాల్జెన్కు నోబెల్ గౌరవం!

భౌతిక శాస్త్ర రంగంలో ప్రతిష్టాత్మకమైన 2026 నోబెల్ బహుమతి ఫ్రాన్సిస్ హాల్జెన్‌ను వరించింది. ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీకి చేసిన నిర్ణయాత్మక కృషి, ఖగోళ మూలం గల అధిక-శక్తి న్యూట్రినోల ఆవిష్కరణకు గాను ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. బెల్జియంలో జన్మించిన ఫ్రాన్సిస్ హాల్జెన్.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్–మాడిసన్లో భౌతిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం […]

పాకిస్థాన్లో ఇమ్రాన్ ఖాన్ విడుదలకు మద్దతుగా నిరసనలు ఉధృతం

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు మరోసారి తీవ్రమయ్యాయి. ఆయనకు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా నుండి ఇస్లామాబాద్ వైపు భారీ పాదయాత్రను ప్రారంభించింది. ప్రభుత్వానికి, పీటీఐకి మధ్య జరిగిన చర్చలు ఒప్పందం కుదరకపోవడంతో ఈ పాదయాత్ర జరిగింది. నిరసనకారులు రాజధానిలోకి ప్రవేశించకుండా అధికారులు అడ్డుకునేందుకు సెక్షన్ 144 విధించారు. పీటీఐ నేతృత్వంలోని పాదయాత్ర ప్రస్తుతం ఇస్లామాబాద్ వైపు సాగుతోంది.

కాలిఫోర్నియాను చుట్టుముట్టిన కార్చిచ్చు

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాంటా క్లారితా (Santa Clarita) పరిసర ప్రాంతాల్లో భయానక కార్చిచ్చు (Wildfire) చెలరేగింది. బలమైన గాలుల కారణంగా మంటలు అత్యంత వేగంగా అటవీ ప్రాంతాలు మరియు నివాస ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. ఏరియల్ డ్రోన్ ఫుటేజ్ (Aerial Footage) దృశ్యాలలో పొగలు, నిప్పుల కొలిమిలా మారిన అడవులు అత్యంత భీతావహంగా కనిపిస్తున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌ అమ్మాయిల యాప్.. ఎలాన్ మస్క్ కామెంట్స్ వైరల్!

ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఎక్కువగా అమ్మాయిలకు సంబంధించిన ప్లాట్‌ఫామ్‌ అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.దీంతో ‘ఇన్‌స్టాగ్రామ్ అమ్మాయిలదైతే.. ఎక్స్ ఎవరిది?’ అంటూ కొందరు నెటిజన్లు మస్క్‌ను ప్రశ్నిస్తున్నారు.ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌ను ‘ఫీమేల్ యాప్’గా పేర్కొంటూ తాను ఆ యాప్‌ను డిలీట్ చేసినట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన ఎలాన్ మస్క్.. ‘ఇన్‌స్టాగ్రామ్ గర్ల్స్ కోసమే’ అంటూ రిప్లై […]

ఎయిర్‌ అంబులెన్స్‌ అదృశ్యం

కెనడాకు చెందిన ప్రముఖ ‘లాటిట్యూడ్ ఎయిర్ అంబులెన్స్’ సంస్థకు చెందిన గల్ఫ్‌స్ట్రీమ్ G100 విమానం అమెరికా తీర ప్రాంతంలో అకస్మాత్తుగా అదృశ్యమవడం కలకలం సృష్టించింది.ఈ మెడికల్ విమానంలో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఇద్దరు పైలట్లు, ఇద్దరు వైద్య సిబ్బంది, ఒక రోగి మరియు ఆ రోగికి చెందిన కుటుంబ సభ్యుడు ఉన్నారు. బెర్ముడాలోని ఎల్.ఎఫ్. వేడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బోస్టన్‌లోని లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ విమానం బయలుదేరింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON