అమెరికా-ఇరాన్ల మధ్య మళ్లీ ఘర్షణలు మొదలవడంతో భారత్ జెండాతో ఉన్న ఏడు నౌకలు జలసంధి వద్ద నిలిచిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం జలసంధి వద్ద ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో జలసంధిని దాటే పరిస్థితి లేదని తెలిపింది. అయితే, ఆయా నౌకల్లో ఏ సరకు ఉందో, ఎక్కడికీ చేరుతాయోనన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. “పర్షియన్ గల్ఫ్ లో భారత్ జెండాలు ఉన్న ఏడు నౌకలు చిక్కుకున్నాయి. అందులో 148 మంది నావికులు ఉన్నారు. ప్రస్తుతం వారు సురక్షితంగానే ఉన్నారు.