ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమానికి ప్రధాన ముఖచిత్రంగా నిలిచిన ముద్రగడ పద్మనాభం
మరణవార్తతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాలు, కాపు సంఘాలు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం చేసిన ఉద్యమాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. కాపు సామాజిక వర్గాన్ని వెనుకబడిన తరగతుల (బీసీ) జాబితాలో చేర్చాలనే డిమాండ్‌తో అనేకసార్లు ఆందోళనలు, నిరాహార దీక్షలు, ప్రజా ఉద్యమాలు నిర్వహించారు.