loader

భారత్‌లో క్లాడ్‌ ఏఐ సబ్‌స్క్రిప్షన్ ప్రకటించిన ఆంథ్రోపిక్‌

ఆంథ్రోపిక్ భారత్లో తన క్లాడ్ ఏఐ సబ్స్క్రిప్షన్ ధరలను ప్రకటించింది. ఇకపై డాలర్లకు బదులుగా రూపాయిల్లోనే చెల్లింపులు చేయొచ్చు. భారత్ క్లాడ్ ప్రో, మ్యాక్స్, టీమ్ పేరిట మూడు రకాల సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. క్లాడ్ ప్రో సబ్స్క్రిప్షన్ ధర నెలకు రూ.2000గా నిర్ణయించింది. క్లాడ్ మ్యాక్స్ ధర నెలకు రూ.11,999 నుంచి ప్రారంభమవుతుంది. గరిష్ఠంగా రూ.23,999 వరకు ఉంటుంది. క్లాడ్ టీమ్ ధర నెలకు రూ.2,399 నుంచి మొదలై రూ.11,999 వరకు ఉంటుంది.

కన్నీళ్లతో మా బాధను ముడి పెట్టొద్దు’.. ట్రోల్స్‌పై జానకి మనవరాలు ఎమోషనల్ పోస్ట్

‘ఒక మనిషిని కోల్పోయినప్పుడు వచ్చే దుఃఖం కొన్ని రోజుల్లో మాయమైపోయేది కాదు. అది జీవితాంతం ఒక గుండె బరువుగా మారి మారి మనసుల్ని మెలిపెడుతూనే ఉంటుంది. నేను కన్నీరు పెట్టుకోలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. దయచేసి కళ్లకు కనిపించని కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు అసలు ఎదుటి వారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలియని వారు.. ఇష్టం వచ్చినట్లు అభిప్రాయాలు ఏర్పరచుకోవడాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది’ అని అప్సర సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

భారతీయ నాసా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపిన రష్యా..!

భారత సంతతికి చెందిన నాసా (NASA) వ్యోమగామి అనిల్ మీనన్ ఇవాళ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. రష్యాకు చెందిన సోయజ్ ఎంఎస్-29 (Soyuz MS-29) వ్యోమనౌక ద్వారా కజకిస్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) బయలుదేరారు. 49 ఏళ్ల అనిల్ మీనన్ అమెరికాలోని మిన్నియాపాలిస్‌లో జన్మించారు. ఆయన తండ్రి భారతీయుడు కాగా, తల్లి ఉక్రెయిన్ వాసి. నాసా వ్యోమగామిగా 2021లో ఎంపిక కావడానికి ముందు ఆయన వైద్యం, సైనిక సేవల్లో అనుభవం […]

అమెరికాలో స్కైడైవింగ్‌ ప్రమాదం.. తెలుగు యువకుడి మృతి

అమెరికాలో స్కైడైవింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో మణిచంద్ర తేజ గడ్డం (28) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయారు. జులై 12న మసాచుసెట్స్లోని ఆరంజ్ పట్టణంలోని స్కైడైవింగ్ అనంతరం కిందకు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా బలమైన గాలులు వీయడంతో పారాచూట్ నియంత్రణ కోల్పోయి.. మణిచంద్ర దాదాపు 30 అడుగుల ఎత్తునుంచి కిందకు పడిపోయి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతుడి తల్లిదండ్రులది విజయవాడ కాగా.. కుమారుడి చదువు నిమిత్తం హైదరాబాద్ కు […]

సౌత్ కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి ఎంగేజ్మెంట్

సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రెండో కుమారుడు సిద్ధార్థ్ గల్లా త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. సిద్ధార్థ్ ఎంగేజ్మెంట్ ఫోటోలను మహేశ్ భార్య నమ్రత ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా సిద్ధార్థ్, హైన్ కిమ్ ప్రేమలో ఉన్నారు. తాను ప్రేమించిన సౌత్ కొరియన్ అమ్మాయి హైన్ కిమ్తో సిద్దార్థ్ నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఇటలీలో ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య […]

చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ- టీడీపీ ఎమ్మెల్యే ఆరోపణలపై సీబీఐ ..!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనపై ఎయిర్ పోర్టు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్లింగ్ కాంట్రాక్టు విషయంల టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపణల్ని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్లింగ్ కాంట్రాక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన పేరును రాజకీయంగా దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు.కాంట్రాక్టు విలువ రూ.300 కోట్లని పత్రికల్లో వచ్చిన  క్లిప్పింగ్స్ […]

పర్షియన్‌ గల్ఫ్‌లో నిలిచిన ఏడు భారత నౌకలు

అమెరికా-ఇరాన్ల మధ్య మళ్లీ ఘర్షణలు మొదలవడంతో భారత్ జెండాతో ఉన్న ఏడు నౌకలు జలసంధి వద్ద నిలిచిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం జలసంధి వద్ద ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో జలసంధిని దాటే పరిస్థితి లేదని తెలిపింది. అయితే, ఆయా నౌకల్లో ఏ సరకు ఉందో, ఎక్కడికీ చేరుతాయోనన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. “పర్షియన్ గల్ఫ్ లో భారత్ జెండాలు ఉన్న ఏడు నౌకలు చిక్కుకున్నాయి. అందులో 148 మంది నావికులు ఉన్నారు. ప్రస్తుతం వారు సురక్షితంగానే […]

6 సార్లు ఎమ్మెల్యే, ఒక‌సారి ఎంపీ..రాజకీయాల్లో ప్రత్యేక స్థానం

1977లో తండ్రి మరణంతో ముద్రగడ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జనతాపార్టీ తరఫున ప్రత్తిపాడు నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1982లో తెలుగుదేశంలో చేరి 1983, 1985 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ఎన్టీఆర్​ కేబినెట్​లో మంత్రిగా పని చేశారు. ప్రత్తిపాడు నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1994 ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఓటమి చవిచూశారు. 1999లో కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొంది పార్లమెంట్​కు వెళ్లారు.

సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు.. ఈసీ కీలక ప్రకటన

సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ముఖ్యమంత్రికి ఒకే ఎపిక్ నెంబరుతో రెండు ఓటర్ల జాబితాల్లో రావడం సాంకేతిక పొరపాటు మాత్రమే అని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలో ఉండే తేడాలను ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియలో సరిచేస్తున్నట్లు వివరించింది. రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును కొడంగల్ లోనే ఉంచుకుంటానని.. సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఓటర్ల జాబితా నుంచి తనను తొలగించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు […]

హిందువుతో పెళ్లి, బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్‌కి ఫత్వా జారీ…

బాలీవుడ్ స్టార్ నటుడు ఆమీర్ ఖాన్ మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నాడు. కొన్ని రోజుల క్రితం తన ప్రియురాలు, పార్టనర్ గౌరీ స్ప్రాట్‌ని మూడో వివాహం చేసుకున్నాడు ఆమీర్ ఖాన్. ఆమీర్ ఖాన్… మూడోసారి కూడా ఓ హిందూ మహిళనే మనువాడాడు. అయితే హిందూ మహిళను వివాహం చేసుకోవడం ఇస్లామియా న్యాయశాస్త్రం షరియా (Sharia)కి విరుద్ధం అంటూ అతనికి ఫత్వా జారీ చేశారు ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తాకు చెందిన షాహీ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్సేన్.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON