సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రెండో కుమారుడు సిద్ధార్థ్ గల్లా త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. సిద్ధార్థ్ ఎంగేజ్మెంట్ ఫోటోలను మహేశ్ భార్య నమ్రత ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా సిద్ధార్థ్, హైన్ కిమ్ ప్రేమలో ఉన్నారు. తాను ప్రేమించిన సౌత్ కొరియన్ అమ్మాయి హైన్ కిమ్‌తో సిద్దార్థ్ నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఇటలీలో ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక ఘనంగా జరిగింది.