పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనకోడలు రాంపూర్ హాట్లోని తన స్వగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో ఆమెపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఇటీవల ఉద్యోగం కోల్పోయారు. ఉద్యోగం పోవడంతో పాటు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆమె గత కొద్దిరోజులుగా తీవ్ర మానసిక ఆందోళన (డిప్రెషన్), వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.