మోదీతో పుతిన్, జిన్‌పింగ్ భేటీ.. ఎస్‌సీవో సదస్సులో అరుదైన భేటీ
కిర్గిస్తాన్‌లో జరుగుతున్న ఎస్‌సీవో సదస్సులో అరుదైన భేటీ జరిగింది. చాలా కాలం తర్వాత ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయ్యారు. ముగ్గురూ ఒకేసారి వేదికపై చేరి, ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు. ముగ్గురూ కొద్దిసేపు సంభాషించుకున్నారు. కిర్గిస్తాన్‌లోని బిష్కెక్‌లో 26వ ఎస్‌సీవో సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో వివిధ దేశాధినేతలు పాల్గొంటున్నారు.

