వణికిస్తున్న వైరల్ జ్వరాలు – రాష్ట్రంలో 15 లక్షల మంది బాధితులు
రాష్ట్రంలో వైరల్ జ్వరాల సీజన్ మొదలైంది. ఉన్నట్టుండి ఆసుపత్రుల్లో రద్దీ పెరుగుతోంది. ఇక్కడ అక్కడ అని కాదు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. వారం రోజులైనా సరే జ్వరం లక్షణాలు తగ్గడం లేదు. పూర్తిగా నీరసపడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు బాధితులు. ఇక డెంగీ, మలేరియా కేసులైతే క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది వైరల్ ఫీవర్ల బారిన పడినట్టు ప్రభుత్వ ఆస్పత్రుల గణాంకాలు చెబుతున్నాయి.