loader

చాలా మంది శ్వాస ఆడకే చనిపోయారు: డాక్టర్ షాకింగ్ అప్‌డేట్!

యూపీ రాజధాని లక్నోలోని ఓ కోచింగ్ సెంటర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మరణాలకు కారణం నిప్పుల కంటే దట్టమైన పొగ  కమ్మేయడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారి యువత ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 15 మంది మృతదేహాలను ఆస్పత్రికి తీసుకువచ్చారని.. వారంతా ఇక్కడికి తీసుకురాకముందే మరణించారని డాక్టర్ ప్రేమ్ రాజ్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారంతా 25 నుంచి 27 ఏళ్ల లోపు వయసున్న యువతీ యువకులే […]

బసవతారకం ఆసుపత్రి పేదవర్గాలకు నిజమైన గుండె ధైర్యం: సీఎం

బసవతారకం ఆసుపత్రిని ఎంతోమంది క్యాన్సర్ బాధితుల పట్ల దేవాలయంగా తీర్చిదిద్దారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఎంతో మంది దాతలు సహకరించారని.. ప్రభుత్వాలు, పార్టీలు అండగా నిలిచాయని చెప్పారు. బసవతారకం ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరై మాట్లాడారు. “క్యాన్సర్తో భార్య చనిపోయాక ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారు. అలాంటి రోగులకు అండగా  ఉండాలని కోరుకున్నారు. బసవతారకం ఆసుపత్రిని అప్పటి ప్రధాని వాజ్ పేయీ ప్రారంభించారు. కొందరు వ్యక్తులు స్వచ్ఛందంగా  ముందుకొచ్చి ఇలాంటి ఆసుపత్రులు పెట్టాలి”అని […]

క్యాన్సర్ రోగుల చిరునవ్వే మా నిజమైన విజయం.. బాలకృష్ణ భావోద్వేగం

ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పేరు మీద ప్రారంభమైన ‘బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ విజయవంతంగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఆస్పత్రి చైర్మన్, నందమూరి బాలకృష్ణ పాల్గొని మాట్లాడారు. తండ్రి ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఈ సంస్థను నేడు దేశంలోనే నెంబర్ వన్ క్యాన్సర్ ఆసుపత్రిగా తీర్చిదిద్దడం గర్వకారణంగా ఉందన్నారు. క్యాన్సర్ మహమ్మారి బారిన పడి కోలుకున్న వారి ముఖాల్లో కనిపించే చిరునవ్వే తమకు నిజమైన పురస్కారమని బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు.

25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!

ఏపీ, కర్ణాటక  ప్రభుత్వాలు.. రికార్డు సమయంలో తుంగభద్ర డ్యామ్ జలాశయానికి ఉన్న మొత్తం 33 క్రెస్ట్ గేట్లను అత్యంత విజయవంతంగా పునరుద్ధరించాయి.జూన్ 25న మునిరాబాద్ కొప్పల్ వద్ద నిర్వహించబోయే తుంగభద్ర నూతన గేట్ల ప్రారంభోత్సవ వేడుక కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని అధికారికంగా ఆహ్వానించేందుకు కర్ణాటక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సోమవారం ఏపీ సచివాలయానికి వచ్చింది.

మహిళా విద్యార్థుల పై చేయి చేసుకున్న సిఐ

ఆందోళన చేస్తున్న మహిళా విద్యార్థుల పై ఆదిభట్ల సి ఐ రవి కుమార్ చేయి వేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా తూర్కయంజల్ న్యూ శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. దీంతో చౌరస్తాలో భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి దర్నా చేస్తున్న విద్యార్థినిలపై చెయ్యి చేసుకున్నాడు.సిఐ రవికుమార్ తీరుపై పోలీస్ ఉన్నతాధికారుల సీరియస్  అయ్యారు.

ప్రభుత్వ ఇసుక రీచ్‌లో టీడీపీ నాయకుల దౌర్జన్యం.. సైట్ ఇంచార్జిపై దాడి..!

జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ఇసుక రీచ్‌పై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుండగులు బరితెగించి దాడికి పాల్పడ్డారు. రాడ్లతో బెదిరించి, భారీగా నగదు బుక్కులు ఎత్తుకెళ్లారు.  తనపై దాడి చేసిన వారిలో గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఆడుసుమిల్లి శ్రీధర్ ఉన్నట్లు స్పష్టంగా గుర్తించానని సైట్ ఇంచార్జి వెల్లడించారు. అంతేకాకుండా.ఈ దౌర్జన్యం వెనుక హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నివసిస్తున్న గుత్తికొండ ఠాగూర్ హస్తం ఉందనే  […]

ఖతార్‌ గ్యాస్‌ ప్లాంట్‌లో పేలుడులో.. భారతీయులతో సహా 13 మంది మృతి

ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ప్రముఖ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు  ప్రమాదంలో పలువురు భారతీయులతో సహా 13 మంది మరణించారు. మరో 66 మంది గాయపడ్డారు. ఖతార్‌ ప్రభుత్వంతో పాటు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం దీనిని  ధృవీకరించింది. కొందరి ఆచూకీ తెలియలేదని ఖతార్ ఇంధన శాఖ తెలిపింది. మృతులు, గాయపడిన వారి జాతీయత వివరాలను ఆ దేశ  అధికారులు వెల్లడించలేదు. గ్యాస్‌ ప్లాంట్‌లో పేలుడును ‘సాంకేతిక ప్రమాదం’గా పేర్కొన్నారు.

వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్.. ఇంటి పక్కనే కొత్త క్రికెటర్ల క్యూ

బీహార్‌లోని సమస్తీపూర్‌కు చెందిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ విజయ ప్రభావం స్వస్థలం సమస్తీపూర్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. వైభవ్ ఇంటి పక్కనే ఉన్న మైదానంలో బీహార్‌లోని వివిధ జిల్లాల నుంచి చిన్నారులు చేరుకుని క్రికెట్ సాధన చేస్తూ, అతడిలా గొప్ప  ఆటగాళ్లుగా ఎదగాలని కలలు కంటున్నారు. సమస్తీపూర్ జిల్లా తాజ్‌పూర్‌లో ఉన్న ఆ మైదానంలో ఒకప్పుడు వైభవ్ సూర్యవంశీ గంటల  తరబడి చెమటోడ్చి సాధన చేసేవాడు. అదే మైదానంలో చిన్నారులు ప్రతిరోజూ బ్యాటింగ్, బౌలింగ్, ఫిట్‌నెస్‌పై […]

అశ్విని వైష్ణవ్‌తో రేవంత్ , కిషన్ రెడ్డి భేటీ

నిన్నమొన్నటి వరకు మెట్రో నిధుల విషయంలో పరస్పరం తీవ్ర విమర్శలు, సవాళ్లు విసురుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల  రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి.. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి చివరకు ఒక్కటిగా వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని  వైష్ణవ్‌ను కలవడం హాట్ టాపిక్‌గా మారింది. సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2  దాదాపు 70 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఓల్డ్ సిటీ కారిడార్లు కు అవసరమైన కేంద్ర ప్రభుత్వ అనుమతులను […]

రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారితో నారా లోకేశ్ భేటీ

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి లీ సియోంగ్-హోను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారత్లో లో కొరియా కంపెనీలకు పెరుగుతున్న ప్రాధాన్యం, భవిష్యత్ భాగస్వామ్య అవకాశాలపై చర్చలు జరిపారు. ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్లు, మైక్రో ఎలక్ట్రానిక్స్, స్టోరేజ్, షిప్ బిల్డింగ్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాలలో కొరియా అగ్రగామిగా నిలుస్తోందని  లోకేశ్ తెలిపారు. కొరియా సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON