జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ఇసుక రీచ్‌పై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుండగులు బరితెగించి దాడికి పాల్పడ్డారు. రాడ్లతో బెదిరించి, భారీగా నగదు బుక్కులు ఎత్తుకెళ్లారు. తనపై దాడి చేసిన వారిలో గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఆడుసుమిల్లి శ్రీధర్ ఉన్నట్లు స్పష్టంగా గుర్తించానని సైట్ ఇంచార్జి వెల్లడించారు. అంతేకాకుండా.ఈ దౌర్జన్యం వెనుక హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నివసిస్తున్న గుత్తికొండ ఠాగూర్ హస్తం ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.