నిన్నమొన్నటి వరకు మెట్రో నిధుల విషయంలో పరస్పరం తీవ్ర విమర్శలు, సవాళ్లు విసురుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి.. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి చివరకు ఒక్కటిగా వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలవడం హాట్ టాపిక్‌గా మారింది. సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 దాదాపు 70 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఓల్డ్ సిటీ కారిడార్లు కు అవసరమైన కేంద్ర ప్రభుత్వ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు.