ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21న యోగా దినోత్సవం కోసం ఏకంగా రూ. 600 కోట్లు ఖర్చు అయినట్టుగా ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వైరల్ ప్రచారంపై ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది.రాష్ట్రంలో యోగా కార్యక్రమం నిర్వహించడానికి వీలుగా జిల్లాకు రూ.25 లక్షలు మాత్రమే కేటాయిస్తూ 2026 జూన్ 5న జీవో ఆర్టీ నెం 562 విడుదల చేసినట్టుగా తెలిపింది. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది.