ఒకే ఇంట్లో నలుగురు అనుమానస్పదస్థితిలో మృతిచెందిన సంఘటన నల్లగొండలోని తెలంగాణ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఓ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. నాలుగు రోజుల క్రితం మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

