బసవతారకం ఆసుపత్రిని ఎంతోమంది క్యాన్సర్ బాధితుల పట్ల దేవాలయంగా తీర్చిదిద్దారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఎంతో మంది దాతలు సహకరించారని.. ప్రభుత్వాలు, పార్టీలు అండగా నిలిచాయని చెప్పారు. బసవతారకం ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరై మాట్లాడారు. “క్యాన్సర్తో భార్య చనిపోయాక ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారు. అలాంటి రోగులకు అండగా ఉండాలని కోరుకున్నారు. బసవతారకం ఆసుపత్రిని అప్పటి ప్రధాని వాజ్ పేయీ ప్రారంభించారు. కొందరు వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలాంటి ఆసుపత్రులు పెట్టాలి”అని చంద్రబాబు పిలుపునిచ్చారు.