ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని,RTGS సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి చిన్న ఘటనను కొన్ని పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని, ముఖ్యంగా సమాజంలో అలజడి సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రతి విషయానికి కులం, మతం రంగు పులుముతూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయని, ఇలాంటి దుష్ప్రచారాల పట్ల ప్రజలు, అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.

