ఉత్తరప్రదేశ్ లక్నోలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అత్యంత రద్దీ ప్రాంతమైన అలీగంజ్ ఉషా మెహతా మార్గ్‌లో ఉన్న ఓ మూడంతస్తుల భవనంలో కొద్దిసేపటి కిందటే ఈ ఘటన సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనం అయ్యారు. పలువురు గాయపడ్డారు. తమ ప్రాణాలను దక్కించుకోవడానికి పలువురు భవనం పైనుంచి కిందకు దూకడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది. అలీగంజ్ ప్రాంతంలోని పురానియా సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ లైబ్రరీ, కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నడుస్తున్న భవనంలో ఈ ప్రమాదం జరిగింది.

