రెస్టారెంట్లు, హోటల్స్పై కొరడా ఝుళిపించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సిద్ధమైంది. దేశంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్యలు చేపడుతోంది. అపరిశుభ్రమైన వంటశాలలు, సురక్షితం కాని ఆహార పదార్థాలు, పరిశుభ్రత నిబంధనలు పాటించని ఆహార తయారీ కేంద్రాలు లేదా విక్రయ కేంద్రాలు కనిపిస్తే, వెంటనే తమ అధికారిక మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని పౌరులకు పిలుపునిచ్చింది. ‘ఫుడ్ సేఫ్టీ కనెక్ట్’ యాప్ ద్వారా అక్రమాలపై ఫిర్యాదు చేయాలని కోరుతోంది