శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో శనివారం పవన్ కుడి భుజానికి ఆపరేషన్ జరిగింది. పవన్ కల్యాణ్‌తో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. పపన్ సతీమణి అన్నా లెజినోవాతోనూ మాట్లాడారు. పవన్‌కు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగినట్లు వైద్యులు తెలిపారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

