నేపాల్ – టిబెట్ సరిహద్దులో చిక్కుకున్న వందలాది మందిని హెలీక్యాప్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.దాదాపు పురుషులే కెప్టెన్లుగా ఉన్న ఈ మిషన్‌లో ప్రియా అధికారి ఒక్కరే మహిళ. ఎక్కడచూసినా మేట వేసిన బురద, మృత్యుదిబ్బగా మారిన ప్రాంతంలో ఆమె నేర్పుగా హెలీక్యాప్టర్ నడిపి.. శభాష్ అనిపించుకున్నారు. ఆ దేశ తొలి మహిళా హెలిక్యాప్టర్ కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన ప్రియ పురుషులతో ధీటుగా రెస్క్యూలో పాల్గొంది. వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా వందకు పైగా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న ఆమెను కొనియాడుతున్నారంతా.