loader

తెలంగాణ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు!

తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన్ను కేంద్ర సర్వీసుల నుంచి రీలీవ్ చేస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర కేడర్ అధికారి కావడంతో వెంటనే ఇక్కడ విధుల్లో జాయిన్ అయ్యేందుకు అడ్డంకులు తొలగినట్లయింది.1992 బ్యాచ్ సంజయ్ జాజు ప్రస్తుతం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ నెలాఖరులో ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు రిటైర్మెంట్ అవనుండటంతో కొత్త సీఎస్ […]

ఫ్రాన్స్‌లో భానుడి భగభగలకు 40 మంది మృతి

ఫ్రాన్స్‌లో లక్షలాది మంది ఠారెత్తిస్తున్న ఎండలతో మాడిపోతున్నారు. గత ఐదు రోజుల్లో అసాధారణ ఉష్ణోగ్రతలతో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. నేషనల్ వెదర్ సర్వీస్, మెట్రోఫ్రాన్స్, దాదాపు 54 విభాగాలను రెడ్ హీట్ వేవ్ అలర్ట్‌లో ఉంచింది. సగానికి సగం దేశంలో ఈ రెడ్ అలర్ట్ సాగుతోంది. సహారా ఎడారి నుంచి ఉత్తరం వైపు వేడి గాలులు రావడంతో ఫ్రాన్స్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎయిర్ కండిషన్ సౌకర్యం విస్తృతంగా లేకపోవడంతో స్కూళ్లు, రైళ్లు, క్రీడాకార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

కిరాణాషాపు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్… 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రి లోకేశ్

కిరాణా కొట్టు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర విద్య,  ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగాల కల్పనకు మంత్రి లోకేష్  నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం ఉండవల్లి నివాసంలో నిర్వహించారు. నవంబర్‌లో నిర్వహించే పార్టనర్ షిప్  సమ్మిట్ నాటికి సాధ్యమైనంత గరిష్టంగా పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అన్నారు.

ప్రమాదం కాదు పక్కా ప్లాన్..ప్రియుడి కోసం కాబోయే భర్తను చంపేసిన యువతి..

సియా, కేతన్.. ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం బాలి వెళ్లాల్సి ఉంది. అక్కడికి వెళ్తే అతడిని చంపడం కుదరదని, సియా,కేతన్ పాస్ పోర్ట్ మిస్  చేయడంతో బాలి ట్రిప్ క్యాన్సిల్ అయింది. జూన్ 14న  కొండ అంచుకు తీసుకెళ్లి అతడిని తోసేసింది. అయితే, అక్కడున్న కొన్ని కొమ్మలు,  పొదలు పట్టుకుని కేతన్ బయటపడ్డాడు. ఎందుకు తోసేసిందో డౌట్ రాకుండా ఉండేందుకు పాము వచ్చిందని,  దాన్నుంచి రక్షించేందుకే  తోసేసినట్లు చెప్పింది. జూన్ 18న మరోసారి అతడిని లోహగడ్ కోటకు […]

రాజేంద్రప్రసాద్, మురళిమోహన్‏కు పద్మ శ్రీ అవార్డులు..

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఈ వేడుకలో ప్రత్యేక గౌరవం దక్కింది. సుదీర్ఘ కాలంగా వెండితెరపై నటుడిగా, నిర్మాతగా సేవలందించిన మాజీ ఎంపీ మురళీమోహన్, అలాగే వైవిధ్యభరితమైన పాత్రలతో, హాస్యంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్‌లు రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ పురస్కారాలను అందుకున్నారు

బ్రేకప్ కాలేదు… విజయ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష

ప్రస్తుతం త్రిష షేర్ చేసిన ఒక పోస్ట్, ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. నిన్నటి నుంచి విజయ్ – త్రిష మధ్య బ్రేకప్ అంటూ వచ్చిన పుకార్లకు ఒక్క ఫోటోతో ఆవిడ చెక్ పెట్టారు. ఓ రోజంతా త్రిష మౌనంగా ఉండటంతో అనేక ఊహాగానాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అయ్యింది. అయితే… అర్థరాత్రి జరిగిన విజయ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష కూడా పాల్గొన్నారని ఆవిడ షేర్ చేసిన ఫోటో బట్టి అర్థం అవుతోంది.

పద్మ శ్రీ అవార్డు అందుకున్న రోహిత్..

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ కీర్తికిరీటంలో మరో అత్యున్నత పురస్కారం చేరింది. దేశంలోనే నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ అవార్డును ఆయన అందుకున్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగిన పౌర పురస్కారాల ప్రధానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా రోహిత్ శర్మ ఈ అవార్డును స్వీకరించారు. తన అద్భుతమైన కెప్టెన్సీతో భారత జట్టుకు చారిత్రాత్మక విజయాలు అందించినందుకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆయనను ఈ పురస్కారంతో గౌరవించింది

సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుమారు 11 వేల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేలా, వారి గ్రాట్యుటీ పరిధితో కూడిన ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2004 నోటిఫికేషన్ కంటే ముందుగా ఉద్యోగ నియామక ప్రక్రియలు పూర్తయి, ఆ తర్వాత విధుల్లో చేరిన సిబ్బంది అందరికీ పాత పెన్షన్ విధానాన్ని (OPS – Old Pension Scheme) వర్తింపజేయాలని నిర్ణయించింది. పాత పెన్షన్ విధానం అమల్లోకి రావడం వల్ల ఉద్యోగులకు పదవీ విరమణ […]

తమిళనాడులో అపరిచితుడు తరహా వెబ్ సైట్-అవినీతిపై భారీ యుద్దం

తమిళనాడులో మద్యం దుకాణాల అవినీతి పై సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీపక్ రూపొందించిన ఒక సాధారణ వెబ్‌సైట్ మద్యం దుకాణాలకే పరిమితం కాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసులు, విద్యుత్ కనెక్షన్లు, పోలీస్ స్టేషన్లు, మున్సిపాలిటీల్లో జరుగుతున్న లంచాల గురించి ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. దీనిని గమనించిన దీపక్.. మే 27న ‘మక్కల్ సాక్షి’ (ప్రజా సాక్షి) పేరుతో సమగ్రమైన పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఇందులో దాదాపు 75 ప్రభుత్వ సేవల విభాగాల్లో జరిగే అవినీతిపై […]

పవన్ కల్యాణ్‌ను కాపు కులానికి పరిమితం చేసేలా వైసీపీ కుట్ర: మంత్రి కందుల దుర్గేష్

వైసీపీ నేతల వైఖరిపై తీవ్రస్థాయిలో మంత్రి దుర్గేష్ ధ్వజమెత్తారు. సాయికృష్ణ అదృశ్యం కేసులో కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తోందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దానికి కులం రంగు పూసి రాజకీయ లబ్ధి పొందడమే ధ్యేయంగా వైసీపీ దిగజారిపోయిందని విమర్శించారు. ప్రభుత్వం తప్పు చేస్తే నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలే తప్ప, ప్రతి అంశంలోనూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని లాగి, ఆయనను ఒక కులానికి పరిమితం చేయాలని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON