కిరాణా కొట్టు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగాల కల్పనకు మంత్రి లోకేష్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం ఉండవల్లి నివాసంలో నిర్వహించారు. నవంబర్లో నిర్వహించే పార్టనర్ షిప్ సమ్మిట్ నాటికి సాధ్యమైనంత గరిష్టంగా పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అన్నారు.