తమిళనాడులో మద్యం దుకాణాల అవినీతి పై సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీపక్ రూపొందించిన ఒక సాధారణ వెబ్సైట్ మద్యం దుకాణాలకే పరిమితం కాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసులు, విద్యుత్ కనెక్షన్లు, పోలీస్ స్టేషన్లు, మున్సిపాలిటీల్లో జరుగుతున్న లంచాల గురించి ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. దీనిని గమనించిన దీపక్.. మే 27న ‘మక్కల్ సాక్షి’ (ప్రజా సాక్షి) పేరుతో సమగ్రమైన పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఇందులో దాదాపు 75 ప్రభుత్వ సేవల విభాగాల్లో జరిగే అవినీతిపై ప్రజలు అజ్ఞాతంగా ఫిర్యాదులు దాఖలు చేయవచ్చు.