రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నగదును విడుదల చేసింది. ఏడు రోజుల వీఆర్ఆర్ (Variable Rate Repo) వేలం ద్వారా రూ.1.41 లక్షల కోట్ల తాత్కాలిక నిధులను విడుదల చేసింది. జీఎస్టీ (GST) చెల్లింపుల కారణంగా వ్యవస్థలో ఏర్పడిన నగదు కొరతను అధిగమించేందుకు ఆర్‌బీఐ ఈ చర్యలు చేపట్టింది. ఇటీవలి జీఎస్టీ చెల్లింపుల వలన బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో నగదు బయటకు వెళ్లింది. దాంతో బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత ఒక్కసారిగా పడిపోయింది.