న్యాయరంగంలో AI కొత్త చరిత్ర సృష్టించింది. బ్రిటన్‌కు చెందిన Garfield AI అనే ఏఐ ఆధారిత న్యాయసంస్థ.. న్యాయవాదులతో పోటీపడి కోర్టు కేసులో విజయం సాధించింది. ఈ కేసుకు సంబంధించిన పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర న్యాయపరమైన డాక్యుమెంట్లన్నీ గార్‌ఫీల్డ్ ఏఐ సంస్థ సిద్ధం చేసింది.విచారణ వేళ ఒక మానవ న్యాయవాదిని కోర్టులో వాదనలు వినిపించేందుకు నియమించింది. లండన్‌లోని వాండ్స్‌వర్త్ కౌంటీ కోర్టులో దాదాపు మూడు గంటలపాటు విచారణ జరిగింది.ఇరుపక్షాల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు.