loader

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నిందితుడు అరెస్ట్..

2026 నీట్- యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణం కేసులో మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు ఒక బీఏఎంఎస్ విద్యార్థిని అరెస్ట్ చేశారు. సుమారు రూ. 10 లక్షలకు ‘గెస్ పేపర్’ కొనుగోలు చేసిన ఆరోపణలపై ఇతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇది కేసు దర్యాప్తులో కీలక పరిణామంగా మారింది. నిందితుడిని శుభమ్ ఖైర్నార్‌ గా గుర్తించారు. ఇతను టెలిగ్రామ్ ద్వారా ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసి ఆ తర్వాత హర్యానాకు చెందిన కొనుగోలుదారుడికి విక్రయించినట్లు ఆరోపణలున్నాయి.

సింగిల్‌ స్క్రీన్‌ ధరలు పెంచేదే లేదు.. తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం

ెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీ బాగుండాలంటే పర్సంటేజీ విధానంలో సింగిల్ స్క్రీన్లు రన్‌ చేయడం తప్పనిసరి అని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌ అభిప్రాయపడ్డది. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌ సమావేశంలో ఈ విషయంలో ఎగ్జిబిటర్లంతా ఓ నిర్ణయానికి వచ్చామన్నారు. సింగిల్‌ స్క్రీన్‌ ధరలు పెంచొద్దని నిర్ణయం తీసుకున్నామన్నారు. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు కాపాడుకోవాల్సిన అవసరముంది. ప్రభుత్వం జీవో ఇచ్చినా తాము ధరలు పెంచమని.. ఇది ప్రేక్షకులకు ఇస్తున్న హామీ అని ప్రకటించారు.

బండి భగీరథ్‌‌కు సిట్ నోటీసులు.. పోక్సో కేసులో విచారణకు రావాలని ఆదేశాలు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విచారణలో వేగం పెరిగింది. ఈ వ్యవహారంలో ఏర్పాటైన సిట్.. విచారణను వేగవంతం చేసింది. బండి భగీరథ్‌కు నోటీసులు జారీ చేశారు. బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో.. విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. బుధవారం రోజున పేట్ బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌లో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు.

ఉదయనిధిపై BJP ఫైర్

సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్, దాన్ని నిర్మూలించాలనే పిలుపునివ్వడం హిందూ సమాజాన్ని అవమానించడమేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఉదయనిధి వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలు కావని, ఇవి ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తమిళనాడు ప్రజలు ఇప్పటికే డీఎంకే (DMK) భావజాలాన్ని తిరస్కరిస్తున్నారని, ఉదయనిధి స్టాలిన్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ, తాను కుల వివక్షకు మరియు అణచివేతకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నానని గతంలో పేర్కొన్నారు.

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన 2008 డిఎస్సి టీచర్లు

అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2008 డిఎస్సి అభ్యర్థులు 1175 మందికి ఉపాధ్యాయులు గా నియమించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆ ఉపాధ్యాయులు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం మహాత్మా జ్యోతి బా ఫూలే ప్రజాభవన్‌లో 2008 డిఎస్సి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 17 సంవత్సరాలుగా టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తమకు చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నారని వారు సంతోషం వ్యక్తం […]

సనాతన ధర్మం పనికిరానిది ..రద్దు చేయాలి: ఉదయనిధి స్టాలిన్

డిఎంకె నేత, మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సనాతన ధర్మం ప్రజలను మతం పేరిట విభజిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి తమిళనాడు అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో ప్రసంగించారు. సనాతన ధర్మం అనేక అనర్థాలకు దారితీస్తోందని, విభేదాలను పెంచుతోందని, తమిళనాడులో ఈ వాదాన్ని తలెత్తనిచ్చేది లేదని ఉద్బేగభరితంగా తెలిపారు.

AIADMK ఆఫీసుకు విజయ్- బలపరీక్ష వేళ రెబెల్స్ తో..!

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్ధితుల్లో అన్నాడీఎంకేలో చీలిక (AIADMK) ఏర్పడింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిని వ్యతిరేకిస్తూ 30 మంది రెబెల్ ఎమ్మెల్యేలు గళం విప్పారు. సీఎం విజయ్ (Vijay)కు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. దీంతో సీఎం విజయ్ ఇవాళ అన్నాడీఎంకే రెబెల్ నేత షణ్ముగం ఆఫీసుకు వెళ్లారు. దీంతో రెబెల్ వర్గం మద్దతు పొందడంలో విజయ్ సక్సెస్ అయినట్లే అని తెలుస్తోంది.

జూన్‌లో సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తాం: మంత్రి దామోదర రాజనర్సింహ

జూన్‌లో సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తామని ఆరోగ్య శాఖ దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఆసుపత్రిలో విజయవంతంగా వైద్య సేవల ట్రయల్ రన్ జరుగుతోందని అన్నారు. సనత్‌నగర్ టిమ్స్‌లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్‌ను మంగళవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. పెండింగ్ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. సనత్‌నగర్ టిమ్స్ వెయ్యి పడకల ఆసుపత్రి అని, ఇందులో 300 ఎమర్జెన్సీ బెడ్లు ఉంటాయని తెలిపారు

సీఎం విజయ్ జ్యోతిష్యుడికి ప్రభుత్వంలో కీలక పదవి

తమిళనాడు సీఎం విజయ్ తన టీంను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు సెక్రటరీలను నియమించుకోగా.. తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు, న్యూమరాలజిస్ట్గా పేరొందిన రిక్కీ రధన్ పండిట్ వెట్రివల్ ను సీఎంకు పొలిటికల్ OSDగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్ కు సన్నిహితుడిగా, ఆధ్యాత్మిక సలహాదారుగా చెప్పుకునే ఈయన..’టీవీకే సునామీ లాంటి విజయం సాధించబోతుంది’ అని పలుమార్లు ప్రకటించారు. అన్నట్టుగానే టీవీకే భారీ విజయం సాధించడంతో ఈయన పేరు మారుమోగింది.

బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు.. రేవంత్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంపై నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. ‘బండి ఎక్కి పారిపోయిన అమానుష బండిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు.. బేటి బచావ్ వదిలేసి, బేటా బచావ్ ఏంటి? నిలదీశారు. బండి సంజయ్ కొడుకును కాపాడటం కోసం రేవంత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. నిందితుడిని రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో, […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON