2026 నీట్- యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణం కేసులో మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు ఒక బీఏఎంఎస్ విద్యార్థిని అరెస్ట్ చేశారు. సుమారు రూ. 10 లక్షలకు ‘గెస్ పేపర్’ కొనుగోలు చేసిన ఆరోపణలపై ఇతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇది కేసు దర్యాప్తులో కీలక పరిణామంగా మారింది. నిందితుడిని శుభమ్ ఖైర్నార్ గా గుర్తించారు. ఇతను టెలిగ్రామ్ ద్వారా ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసి ఆ తర్వాత హర్యానాకు చెందిన
కొనుగోలుదారుడికి విక్రయించినట్లు ఆరోపణలున్నాయి.

