క్రికెట్ ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, ఆట చరిత్రలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన సర్ గార్ఫీల్డ్ సోబర్స్ (89) అనారోగ్యంతో కన్నుమూశారు. 1954 నుంచి 1974 వరకు దాదాపు రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ను శాసించిన సోబర్స్, తన కెరీర్లో మొత్తం 93 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆయన 57.78 సగటుతో 8,032 పరుగులు సాధించారు. ఇందులో 26 అద్భుతమైన సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో ఆయన నమోదు చేసిన అత్యధిక స్కోరు 365 నాటౌట్.