ెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీ బాగుండాలంటే పర్సంటేజీ విధానంలో సింగిల్ స్క్రీన్లు రన్ చేయడం తప్పనిసరి అని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అభిప్రాయపడ్డది. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశంలో ఈ విషయంలో ఎగ్జిబిటర్లంతా ఓ నిర్ణయానికి వచ్చామన్నారు. సింగిల్ స్క్రీన్ ధరలు పెంచొద్దని నిర్ణయం తీసుకున్నామన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు కాపాడుకోవాల్సిన అవసరముంది. ప్రభుత్వం జీవో ఇచ్చినా తాము ధరలు పెంచమని.. ఇది ప్రేక్షకులకు ఇస్తున్న హామీ అని ప్రకటించారు.

