అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2008 డిఎస్సి అభ్యర్థులు 1175 మందికి ఉపాధ్యాయులు గా నియమించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆ ఉపాధ్యాయులు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం మహాత్మా జ్యోతి బా ఫూలే ప్రజాభవన్లో 2008 డిఎస్సి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 17 సంవత్సరాలుగా టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తమకు చివరికి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నారని వారు సంతోషం వ్యక్తం చేశారు.

