ఆంథ్రోపిక్ భారత్లో తన క్లాడ్ ఏఐ సబ్స్క్రిప్షన్ ధరలను ప్రకటించింది. ఇకపై డాలర్లకు బదులుగా రూపాయిల్లోనే చెల్లింపులు చేయొచ్చు. భారత్ క్లాడ్ ప్రో, మ్యాక్స్, టీమ్ పేరిట మూడు రకాల సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. క్లాడ్ ప్రో సబ్స్క్రిప్షన్ ధర నెలకు రూ.2000గా నిర్ణయించింది. క్లాడ్ మ్యాక్స్ ధర నెలకు రూ.11,999 నుంచి ప్రారంభమవుతుంది. గరిష్ఠంగా రూ.23,999 వరకు ఉంటుంది. క్లాడ్ టీమ్ ధర నెలకు రూ.2,399 నుంచి మొదలై రూ.11,999 వరకు ఉంటుంది.