‘ఒక మనిషిని కోల్పోయినప్పుడు వచ్చే దుఃఖం కొన్ని రోజుల్లో మాయమైపోయేది కాదు. అది జీవితాంతం ఒక గుండె బరువుగా మారి మారి మనసుల్ని మెలిపెడుతూనే ఉంటుంది. నేను కన్నీరు పెట్టుకోలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. దయచేసి కళ్లకు కనిపించని కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు అసలు ఎదుటి వారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలియని వారు.. ఇష్టం వచ్చినట్లు అభిప్రాయాలు ఏర్పరచుకోవడాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది’ అని అప్సర సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.