అమెరికాలో స్కైడైవింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో మణిచంద్ర తేజ గడ్డం (28) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయారు. జులై 12న మసాచుసెట్స్లోని ఆరంజ్ పట్టణంలోని స్కైడైవింగ్ అనంతరం కిందకు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా బలమైన గాలులు వీయడంతో పారాచూట్ నియంత్రణ కోల్పోయి.. మణిచంద్ర దాదాపు 30 అడుగుల ఎత్తునుంచి కిందకు పడిపోయి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతుడి తల్లిదండ్రులది విజయవాడ కాగా.. కుమారుడి చదువు నిమిత్తం హైదరాబాద్ కు వచ్చి నివసిస్తున్నట్లు సమాచారం.