సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ముఖ్యమంత్రికి ఒకే ఎపిక్ నెంబరుతో రెండు ఓటర్ల జాబితాల్లో రావడం సాంకేతిక పొరపాటు మాత్రమే అని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలో ఉండే తేడాలను ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియలో సరిచేస్తున్నట్లు వివరించింది. రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును కొడంగల్ లోనే ఉంచుకుంటానని.. సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఓటర్ల జాబితా నుంచి తనను తొలగించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు పేర్కొంది.

